NTV Telugu Site icon

Noida Airport: జెవార్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్.. త్వరలో పూర్తి సేవలు

Firstflite

Firstflite

నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో తొలి విమాన టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. సోమవారం అధికారులు నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్‌గా ముగిసింది. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం నోయిడాలో దిగింది. విమానం ల్యాండ్ కాగానే.. ఫైర్ ట్యాంకర్లతో నీటిని వెదజల్లి స్వాగతం పలికాయి. విమానం ల్యాండింగ్‌పై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇది గొప్ప విజయం అని కొనియాడారు. 2025, ఏప్రిల్ నుంచి ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఉన్న నోయిడాలోని జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. సోమవారం అధికారులు తొలి విమాన పరీక్ష నిర్వహించారు. నోయిడా విమానాశ్రయంలోని రన్‌వేపై ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రజల కోసం కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ప్రధాన విమానాశ్రయంగా గుర్తింపు పొందుతుంది.

జెవార్ ఎయిర్‌పోర్ట్ ఏప్రిల్ 17, 2025న కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ధృవీకరించింది. ప్రారంభంలో వివిధ ప్రదేశాలకు 30 విమాన సర్వీసులను అందించనుందని పేర్కొంది. ఇండిగో, అకాసా ఎయిర్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. దేశీయ మార్గాలకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంతర్జాతీయ కనెక్షన్ల కోసం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌తో చర్చిస్తున్నట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబరు, 2023లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ సాధ్యపడలేదు. త్వరలో జెవార్ విమానాశ్రయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రెండవ అతిపెద్ద విమానాశ్రయంగా మారనుంది. ప్రారంభంలో 62 దేశీయ, రెండు అంతర్జాతీయ, ఒక కార్గో మార్గంతో సహా 65 రోజువారీ విమానాలను అందించనుది. పూర్తిగా కార్యాచరణలోకి వస్తే ఆసియాలోని అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటిగా, ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద విమానాశ్రయంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

Show comments