ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఇక నుంచి PC లోనూ యాప్‌ను వాడుకోవచ్చని తెలిపింది. వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ కంప్యూటర్‌లో ఎడిట్ చేసుకున్న ఫొటోల్ని, హైలీ ప్రాసెస్స్ ఇమేజ్‌లను సైతం అప్‌లోడ్ చేయొచ్చు. ఇంతకుముందు ఈ అవకాశం కేవలం స్మార్ట్ ఫోన్‌లో మాత్రమే అప్‌లోడ్ చేసుకునే వీలు ఉండేది. ఈ ఫీచర్‌తో ఇక నుంచి యూజర్లకు ఇబ్బంది లేకుండా పర్సన్‌లో పీసీలో వాడుకోవచ్చని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్‌లతో పాటు మరిన్ని ఫీచర్‌లను తీసుకు వచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.
ఇన్‌స్టా యూజర్లకు శుభవార్త
