Site icon NTV Telugu

ఉచిత రేషన్‌ బంద్‌: కేంద్రం

కరోనా కష్టకాలంలో ఎంతో మందికి కడుపునింపిన రేషన్‌ను ఇక నుంచి ఉచితంగా ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్‌ బియ్యాన్ని ఇక నుంచి ఉచితంగా ఇవ్వబోమని తెలిపింది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో గతేడాది మార్చి నుంచి అందిస్తున్న ఉచిత రేషన్‌ను నవంబర్‌ 30 తర్వాత పొడిగించబోమని కేంద్రప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే ఈ పథకం ద్వారా అర్హులైన 80 కోట్లకు పైగా మంది ప్రజలు నెలకు 5కేజీల చొప్పున బియ్యం/ గోధుమలు, కుటుంబానికి ఒక కేజీ శనిగలను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. కాగా కరోనాతో ఎంతో మంది ఆకలి చావులతో మరణించారు. కరోనా కాలంలో ఉచిత రేషన్ వల్ల పేదలు రెండు పూటలు భోజనం చేయగలిగారు. ఆకలి చావులను తప్పించేందుకు ఉచిత రేషన్‌ ఎంతగానో తోడ్పడింది.

Exit mobile version