NTV Telugu Site icon

Swara Bhasker: “పప్పు”కు మీరెందుకు భయపడుతున్నారు.. రాహుల్ గాంధీకి స్వరాభాస్కర్ మద్దతు

Rahul Gandhi 2

Rahul Gandhi 2

Swara Bhasker: అనర్హత వేటు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ మద్దతుగా నిలిచారు. పప్పు అని విమర్శిస్తున్నవారు ఆయనకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడంపై ట్వీట్ చేస్తూ.. చట్టాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించారు. ఆయనను డిస్ క్వాలిఫై చేయడానికి చట్టాలను దుర్వినియోగం చేశారని అన్నారు.

Read Also: Rahul Gandhi: దటీజ్ రాహుల్.. డిస్ క్వాలిఫైడ్ ఎంపీ అంటూ ట్విట్టర్ అకౌంట్‌లో మార్పు

రాహుల్ గాంధీని పప్పు అని పిలుస్తారు.. పప్పు అని పిలువబడే వ్యక్తికి భయపడుతున్నారని బీజేపీని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ, విశ్వసనీయత, ఔన్నత్యాన్ని అరికట్టడానికి 2024లో పోటీ చేయకుండా బలమైన వ్యూహాలను అమలు చేయడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మరింత బలంగా తిరిగివస్తారని నా అంచాన అంటూ స్వరాభాస్కర్ ట్వీట్ చేశారు.

బీజేపీ వ్యతిరేకం తరుచూ విమర్శలు గుప్పించే స్వరాభాస్కర్, రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం రాహుల్ గాంధీపై పార్లమెంటరీ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఈ చట్టం ప్రకారం అనర్హత ఎదుర్కోవాల్సిందే. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

Show comments