NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?

Pm Modi

Pm Modi

Rahul Gandhi: కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళలోని వయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 400 మంది కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్ పర్యటనకు వెళ్లారు. ఈ ఘటనలో బాధిత ప్రజలను నేరుగా కలిశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. స్థానిక ఆస్పత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శించారు. పర్యటనలో ఎంత మంతి పిల్లలు తమ వారిని పోగొట్టుకున్నారని కేరళ సీఎం పినరయి విజయన్‌ కేంద్ర మంత్రి సురేష్ గోపీలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో పునరావాసం మరియు సహాయక చర్యల కోసం ₹ 2,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది.

Read Also: S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్‌తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..

ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్‌ని సందర్శించడాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ‘‘ఈ భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంల తెలుసుకునేందుకు వయనాడ్‌ని సందర్శించినందుకు మోడీజీకి ధన్యవాదాలు. ఇది మంచి నిర్ణయం. విధ్వంసాన్ని ప్రధాని ప్రత్యక్షంగా చూసిన తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అంతకుముందు ప్రమాద ప్రాంతాన్ని రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. జూలై 30న, వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 416 మంది మరణించారు ,150 మందికి పైగా తప్పిపోయారు.

Show comments