కర్ణాటకలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా బెంగళూరులో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 8,906 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,113 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో పాజిటివిటీ రేటు 10శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Read: కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని… ఆ తల్లి…
కర్ణాటకలో నమోదవుతున్న కేసుల్లో 79 శాతం కేసులు బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నట్టు కర్ణాటక హెల్త్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ తెలియజేశారు. బెంగళూరులో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఒమిక్రాన్ కారణంగానే కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని నిర్లక్ష్యం చేయవద్దని తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
