Site icon NTV Telugu

High Tension Chennai: హీరో విజయ్ ఇంటి వద్ద హైటెన్షన్.. మద్రాసు హైకోర్టుకు టీవీకే!

Tvk

Tvk

High Tension Chennai: తమిళనాడులోని కరూర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు కారణమైన టీవీకే చీఫ్ విజయ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయ్ ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి. 39 మంది మరణాలకు కారణం విజయ్ అంటూ నినాదాలు చేశారు. తక్షణమే విజయ్ నీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది.

Read Also: Jathadhara : “జటాధార” కల్పిత కథ మాత్రమే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మరోవైపు, పార్టీ ముఖ్య నేతలతో టీవీకే పార్టీ అధినేత విజయ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణ, న్యాయ సలహాలపై నేతలతో ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. అలాగే, కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో టీవీకే పార్టీ ఉన్నట్లు సమాచారం. స్వతంత్ర దర్యాప్తు చేయాలని టీవీకే నేతలు కోరే అవకాశం ఉంది.

Exit mobile version