Site icon NTV Telugu

Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

Kedharnath

Kedharnath

Kedarnath: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్‌ ట్రావెల్స్‌ ద్వారా 18 మంది వెళ్లాగా.. కేదార్‌నాథ్‌ దర్శనం తర్వాత వీరిలో 14 మంది బద్రీనాథ్‌కు బయల్దేరి వెళ్లారు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్‌- బద్రీనాథ్‌ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రెండు రోజులుగా నిజామాబాద్‌, విజయనగరం యాత్రికులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుని పోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాప్టర్‌ సర్వీసులను అధికారులు నిలిపేశారు.

Read Also: Kamala Harris Vs Donald Trump : ఇక నో డిబేట్స్ ఓన్లీ యాక్షన్.. కమలా హారిస్ పై వెనక్కి తగ్గిన ట్రంప్

ఇక, మరోవైపు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో తెలుగు దేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు.. అధికారులతో మాట్లాడాం.. అందరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తామని ఎంపీ చెప్పారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌తో కలిశెట్టి చర్చించారు. యాత్రికులను వెంటనే రక్షించాలని రెసిడెంట్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. యాత్రికుల్లో పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. వారిని హెలికాప్టర్లలో తక్షణమే ఆస్పత్రికి తరలించాలని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు కోరారు.

Exit mobile version