Site icon NTV Telugu

Governor Tamilisai: మరోసారి మానవత్వం చాటుకున్న గవర్నర్‌.. కారు దిగి.

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్​ గానే కాకుండా అటు పుదుచ్చేరి లెఫ్ట్​నెంట్ గవర్నర్​ గా తన బాధ్యలు కొనసాగిస్తూ ఎప్పుడు సామాజిక అంశాల్లో ముందుంటారు తమిళిసై. ఇక,డాక్టర్​ వృత్తిపట్ల ఆమెకు ఉన్న అనుభవంతో ఎక్కడికి వెళ్లినా తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైనప్పుడు చికిత్స చేయడానికి ఎప్పుడు ఆమె ముందుకొస్తారు. అంతే కాదు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆమె తన హోదానే మరిచి క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు సాయం చేయడానికి చూస్తారు.

Read also: Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్

ఈనేపథ్యంలో.. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్​కు ఆమె వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడి నుంచి వెళుతున్న ఆమె ఇది గమనించిన కారును ఆపి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అంతేకాదు అంబులెన్స్ కు ఫోన్​ చేసి ఘటనా స్థలానికి అక్కడికి పిలిపించారు. అయితే.. ఆస్పత్రి వారితో గవర్నర్​ మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించగలిగితే ప్రాణాలు నిలబెట్టినవారిమవుతామని సూచించారు ఆవ్యక్తికి చికిత్సచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు గవర్నర్.
S. S.Rajamouli: ఓటీటీలో దూసుకుపోతున్న బ్రహ్మాస్త్ర.. ఫలించిన జక్కన్న స్ట్రాటజీ

Exit mobile version