Site icon NTV Telugu

Telangana Debts Row: శ్రీలంక సంక్షోభం ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ అప్పులపై రచ్చ

Telangana Debts Row

Telangana Debts Row

Discusses on Telangana Debts in All Party Meeting: శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాల అప్పులు ప్రస్తావన వచ్చింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల అప్పులపై చర్చించారు. అయితే శ్రీలంక సంక్షోభంపై నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్ లో వివిధ రాష్ట్రాల అప్పుల గుర్తించి ప్రస్తావించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రస్తుతం ఈ విషయం కొత్త వివాదానికి దాారి తీసింది. మంగళవారం విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే వివిధ రాష్ట్రాల అప్పుల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ముఖ్యంగా కేంద్ర వైఖరిపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణ అప్పులపై మాట్లాడింది. శ్రీలంక పరిస్థితికి రాజకీయాలు, అప్పులే కారణం అని కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ లో వెల్లడించింది. దీంతో పాటు శ్రీలంకలో చైనా పెట్టుబడులు, పోర్టుల్లో పెట్టుబడుల కారణంగా రుణ ఊబిలో చిక్కకుపోయిందని కేంద్రం విశ్లేషించింది.

Read Also: Arvind Dharmapuri: కేసీఆర్ ని ఇక పరుషంగా విమర్శించను

ఈ సమావేశంలోొ శ్రీలంక సంక్షోభం అప్పులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని పార్టీలకు వివరించింది. అయితే శ్రీలంక ప్రస్తుత సంక్షోభానికి అపరిమిత అప్పులే కారణం అని విశ్లేషణాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా ఇండియాలో కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పుల గురించి చర్చించారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల అప్పుల గురించి చర్చించడాన్ని టీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావులు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిమితికి మించి కేంద్ర చేస్తున్న అప్పుల గురించి కూడా వివరించాలని గట్టిగా డిమాండ్ చేశారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడటంలో రాజకీయ దురుద్దేశం ఉందని నామా నాగేశ్వర్ రావు విమర్శించారు. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని.. గత ఎనిమిదేళ్లలో కేంద్ర లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిందని.. నామా నాగేశ్వర్ రావు అన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో కేవలం 23 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని ఆయన కేంద్రానికి వివరించారు.

Exit mobile version