Site icon NTV Telugu

Telangana Congress : రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

ఇటీవల 40 ల‌క్షల మందికి కాంగ్రెస్ పార్టీ డిజిటల్‌ స‌భ్య‌త్వం ఇచ్చిన నేప‌థ్యంలో రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఒక్కొక్కరికి రెండుల‌క్షల బీమా చేయించనున్నారు. మొత్తం 40ల‌క్ష‌ల మందికి ఆరున్న‌ర కోట్ల రూపాయ‌ల ప్రీమియం చెక్కును రాహుల్ గాంధీ చేతుల మీదుగా బీమా సంస్థ‌ల‌కు రేవంత్ రెడ్డి బృందం అంద‌జేయ‌నుంది. అయితే ఈ నెల‌తో స‌భ్య‌త్వ న‌మోదు ప్రక్రియ ముగియనుంది.

తెలంగాణలోని 32 వేల పోలింగ్ బూత్ లకుగాను 40 ల‌క్ష‌ల మందికి స‌భ్య‌త్వం పొందారు. 80 ల‌క్ష‌ల ఓట్ల‌తో 90 స్థానాల్లో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ వ్యూహం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్య‌ధిక స‌భ్య‌త్వం తెలంగాణ కాంగ్రెస్‌ చేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ వరి వరంగల్‌ పేరుతో సభ నిర్వహించనుంది. ఈ సభకు రాహుల్‌గాంధీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

https://ntvtelugu.com/mlc-ashok-made-comments-on-cm-jagan/
Exit mobile version