CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy US visit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం చర్చగా మారింది.. దీనిపై రాజకీయ విమర్శలు కూడా జోరుగా సాగుతున్నాయి.. అయితే, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. రేవంత్ రెడ్డి పర్యటనకు రాజకీయ అనుమతి (Political Clearance) ఇవ్వలేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) రాజకీయ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
విదేశీ పర్యటనలకు సంబంధించిన ప్రతిపాదిత కార్యక్రమాలు ముఖ్యమంత్రి వంటి పదవిలో ఉన్న వ్యక్తికి తగినవిగా ఉండటంతో పాటు, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పర్యటనలో చేపట్టే కార్యక్రమాలను పరిశీలించిన తర్వాతే రాజకీయ అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అమెరికా పర్యటనకు సంబంధించి ప్రతిపాదించిన కార్యక్రమాలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కారణంగానే అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించింది.
Also Read
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
యూకే పర్యటనకు మాత్రం అనుమతి
ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి యూకే పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. అంటే అమెరికా పర్యటనకు మాత్రమే ప్రతిపాదిత కార్యక్రమాలకు సంబంధించిన కారణాలతో అనుమతి లభించలేదని కేంద్రం వివరణ ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు సంబంధించి కేంద్రం అనుమతి ప్రక్రియలో పర్యటన ఉద్దేశం, ప్రతిపాదిత కార్యక్రమాలు, పదవికి తగిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. మొత్తంగా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రాజకీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే యూకే పర్యటనకు అనుమతి ఇవ్వడం ద్వారా రెండు పర్యటనల ప్రతిపాదిత కార్యక్రమాల్లో తేడాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!