Site icon NTV Telugu

KCR in Jharkhand: గ‌ల్వాన్ అమ‌ర జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం

జార్ఖండ్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. గతంలో గాల్వన్‌ వాలీ అమర జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రకటన మేరకు వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి రూ. 10 లక్షల చెక్ అందించిన సీఎం కేసీఆర్… మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు కూడా రూ. 10 లక్షల చెక్‌ను అందించారు.. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో క‌లిసి ఆ కుటుంబాల‌ను పరామర్శించిన కేసీఆర్.. ఈ సందర్భంగా చెక్కులు అందజేశారు.. ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చారు.. అండ‌గా ఉంటామ‌ని భరోసా కల్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

Read Also: Kishan Reddy: కేసీఆర్‌కు కిషన్‌ రెడ్డి మరో లేఖ.. ఆ షేర్‌ విడుదల చేయండి.

కాగా, చైనా సైనికులు భారత్‌లోని గల్వాన్‌ లోయపై పట్టు సాధించడానికి మన సైనికులతో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే కాగా… ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌కుమార్‌తో పాటు 19 మంది సైనికులు వీరమరణం పొందారు.. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటానని ప్రకటించిన కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించారు.. అందులో భాగంగా.. ఇప్పుడు చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.. త్వరలోనే మిగతా రాష్ట్రాలకు వెళ్లి చెక్కులు అందజేయనున్నారు.

Exit mobile version