Site icon NTV Telugu

Tejashwi Yadav: మరోసారి తండ్రైన తేజస్వి యాదవ్.. మగ బిడ్డ జననం

Tejashwiyadav

Tejashwiyadav

బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మరోసారి తండ్రయ్యారు. తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చిందని తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శిశువు ఫొటోను కూడా పంచుకున్నారు. చిన్నారి రాకను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Protein Foods: శరీరానికి ప్రోటీన్ అందాలంటే వీటిని తినాల్సిందే..!

తేజస్వి యాదవ్ మొదటి సంతానం 2023లో నవరాత్రి సమయంలో జన్మించింది. ఆ చిన్నారికి కాత్యాయని అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్‌కు 2021లో పెళ్లైంది. చిరకాల స్నేహితురాలు రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్నారు. 2021, డిసెంబర్‌లో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. తేజస్వి-రాచెల్ గోడిన్హో న్యూఢిల్లీలోని ఆర్కేపురంలో డీపీఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అలా చిన్ననాటి స్నేహితురాలిని మనువాడారు.

ఇది కూడా చదవండి: Kannappa : ‘కన్నప్ప’ కి కన్నం వేసిన ఆఫీస్ బాయ్..

ప్రస్తుతం తేజస్వి యాదవ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ బాధ్యతలు మీద వేసుకుని ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆశ పడుతున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందు మరోసారి తండ్రి కావడంతో ఆనందంలో ఉన్నారు.

 

Exit mobile version