NTV Telugu Site icon

Tamil Nadu: కొడైకెనాల్‌లో విషాదం.. యువకుల ప్రాణాలు తీసిన బార్బీ క్యూ చికెన్

Chicken

Chicken

తమిళనాడులోని కొడైకెనాల్‌లో విషాదం చోటుచేసుకుంది. బార్బీ క్యూ చికెన్ తయారీ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది. దీంతో కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

కొడైకెనాల్‌లో ఎంజాయ్ చేసేందుకు తిరుచికి చెందిన నలుగురు యువకులు వెళ్లారు. శుక్రవారం రాత్రి రూమ్‌లో మద్యం తీసుకుని మందులో మంచింగ్ కోసం బార్బీ క్యూ చికెన్ తయారు చేసుకునేందుకు యువకులు సిద్ధమయ్యారు. చికెన్ తయారీ కోసం బొగ్గులు స్టవ్ తెచ్చుకొని స్వయంగా వండుకున్నారు. అనంతరం యువకులు మత్తుగా మద్యం సేవించారు. అయితే మద్యం మత్తులో స్టవ్ ఆఫ్ చేయకుండానే నిద్రలోకి జారుకున్నారు. అయితే పొగ రావడంతో ఏసీలోకి ప్రవేశించి ఊపిరాడకుండా చేసింది. దీంతో ఇద్దరు యువకులు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు యువకులు మాత్రం వేరే రూమ్‌లో పడుకోవడంతో సేఫ్‌గా ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: COVID-19 warning: కరోనాపై డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్.. దేశాలకు అలర్ట్ జారీ

Show comments