Geyser: బాత్రూంలో గీజర్ గ్యాస్ లీక్.. ఊపిరాడక యువతి మృతి..
- గీజర్ గ్యాస్ లీక్..
- స్నానం చేస్తుండగా బాత్రూంలో 16 ఏళ్ల బాలిక మృతి..
- ఊపిరాడకపోవడంతోనే మరణించినట్లు ప్రాథమిక అంచనా..
Geyser: ఇటీవల కాలంలో గీజర్, వాటర్ హీటర్ ప్రమాదాల వల్ల పలువురు మరణించారు. చాలా సందర్భాల్లో గాయాలకు గురవుతున్నారు. బాత్‌రూంలో గీజర్లు పేలిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. శీతాకాలం రావడంతో గీజర్లు, వాటర్ హీటర్ల వాడకం పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో గీజర్లు పేలుడు ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు వాటర్ హీటర్ల షాక్‌ల వలన మరణాలు సంభవిస్తున్నాయి.
Read Also: Ram Charan: డల్లాస్ వచ్చానా లేక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నానా?
Also Read
- West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఇదిలా ఉంటే, గీజర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో 16 ఏళ్ల యువతి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్‌లో శుక్రవారం జరిగింది. బాధిత యువతిని మహిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం యువతి తల్లి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో కుల్దీప్ విహార్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహి సోదరుడు మాధవ్ మాట్లాడుతూ.. బాత్రూర్ డోర్ బయట నుంచి లాక్ చేశామని, గతంలో కొన్ని సందర్భాల్లో ఆమె స్నానం చేస్తూ స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం కూడా ఇలాగే జరగడంతో జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. రెండేళ్ల క్రితం బాలిక ఇలాగే స్పృహతప్పి పడిపోయిందని, ఆ తర్వాత కోలుకుందని కుటుంబీకులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. బాత్‌రూమ్‌లోని గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్‌రూమ్‌లో వెంటిలేషన్ లేకపోవడం కూడా కారణమని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!