NTV Telugu Site icon

Geyser: బాత్‌రూంలో గీజర్ గ్యాస్ లీక్.. ఊపిరాడక యువతి మృతి..

Geyser

Geyser

Geyser: ఇటీవల కాలంలో గీజర్, వాటర్ హీటర్ ప్రమాదాల వల్ల పలువురు మరణించారు. చాలా సందర్భాల్లో గాయాలకు గురవుతున్నారు. బాత్‌రూంలో గీజర్లు పేలిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. శీతాకాలం రావడంతో గీజర్లు, వాటర్ హీటర్ల వాడకం పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో గీజర్లు పేలుడు ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు వాటర్ హీటర్ల షాక్‌ల వలన మరణాలు సంభవిస్తున్నాయి.

Read Also: Ram Charan: డల్లాస్ వచ్చానా లేక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నానా?

ఇదిలా ఉంటే, గీజర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో 16 ఏళ్ల యువతి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్‌లో శుక్రవారం జరిగింది. బాధిత యువతిని మహిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. శుక్రవారం యువతి తల్లి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో కుల్దీప్ విహార్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహి సోదరుడు మాధవ్ మాట్లాడుతూ.. బాత్రూర్ డోర్ బయట నుంచి లాక్ చేశామని, గతంలో కొన్ని సందర్భాల్లో ఆమె స్నానం చేస్తూ స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం కూడా ఇలాగే జరగడంతో జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. రెండేళ్ల క్రితం బాలిక ఇలాగే స్పృహతప్పి పడిపోయిందని, ఆ తర్వాత కోలుకుందని కుటుంబీకులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. బాత్‌రూమ్‌లోని గీజర్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో ఊపిరాడక బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాత్‌రూమ్‌లో వెంటిలేషన్ లేకపోవడం కూడా కారణమని వైద్యులు వెల్లడించారు.

Show comments