TDP MLA Balakrishna Did Not Cast His Vote In Presidential Election 2022: ఢిల్లీలోని పార్లమెంట్‌లో సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా మొదలైన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఇందుకు కారణం.. ఆయన విదేశాల్లో ఉండటమే! ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన, ఇంకా భారత్‌కి తిరిగి రాలేదు. అందుకే, ఓటింగ్‌కు హాజరు కాలేకపోయారు. మరో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమహేంద్రవరం రూరల్) కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల.. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనలేదు. కాగా.. ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 167 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు.
ఇదిలావుండగా.. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. చకచకా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, ఓ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ, ఇంతవరకూ టైటిల్ ప్రకటించలేదు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య ఓటమి ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన 108వ సినిమా చేయనున్నారు. తండ్రి, కూతురు బంధం నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకి వెళ్లనుంది.