NTV Telugu Site icon

Taslima Nasreen: ప్రవక్త బతికుంటే వీరి పిచ్చి పనులకు షాక్ అయ్యే వారు.

Taslima

Taslima

వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ భారత్ లో జరుగుతున్న హింసాకాండపై స్పందించారు. మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత భారత్ లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల పిచ్చిని చూసి తాను షాక్ అయ్యానని వ్యాఖ్యానించారు.

ప్రవక్త ముహమ్మద్ ఈ రోజు జీవించి ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతోన్మాదుల వెర్రితనాన్ని చూసి అతను షాక్ అయ్యి ఉండేవాడు. మానవుడు, సాధువు, మెస్సీయ, ప్రవక్త, దేవుడు ఎవరూ విమర్శలకు అతీతులు కాదని.. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి విమర్శనాత్మక పరిశీలన అవసరం అని ఆమె ట్వీట్ చేశారు.

తస్లీమా నస్రీన్ పుస్తకం ‘‘ లజ్జా’’ చాలా వివాదాస్పదం అయింది. ముస్లిం మతంలో ఉండే ఛాందసవాద పోకడలను ఈమె విమర్శించింది. దీంతో ఆమెను చంపుతామని బెదిరింపులు రావడంతో 1994 నుంచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఒక సారి హైదరాబాద్ కు వచ్చిన ఆమెపై కొంతమంది దాడికి కూడా యత్నించారు. ఆమె స్వీడన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నప్పటీకి ఎక్కువ యూఎస్ఏ, యూరోపియన్ దేశాల్లో నివసిస్తున్నారు. భారత్ లో శాశ్వతంగా నివసించాలనే కోరికను చాలా కాలం నుంచి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో అరబ్ ప్రపంచంతో పాటు ఇండియాలోని ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఖతార్, మలేషియా, యూఏఈ, టర్కీ, ఇరాన్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలియజేశాయి. అయితే కొందరి వ్యక్తుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించవద్దని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై శుక్రవారం దేశంలోని ఢిల్లీ, రాంచీ, ప్రయాగ్ రాజ్, హౌరా, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి.

 

Show comments