Site icon NTV Telugu

Panneerselvam: కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి

Panneerselvam

Panneerselvam

Panneerselvam: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం తెలిపింది. కరోనా తేలికపాటి లక్షణాలతో జూలై 15న పన్నీర్ సెల్వం ఐసోలేషన్ యూనిట్‌లో చేరినట్లు ఎంజీఎం హెల్త్‌కేర్ మెడికల్ బులెటిన్‌లో తెలిపింది. ఆయనకు ప్రస్తుతం వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని.. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. వైద్య బృందం సలహామేరకు పన్నీర్‌సెల్వం మందులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Minister Harish Rao : డాక్టర్లు ఎవరూ సెలవులు తీసుకోవద్దు

పన్నీర్‌సెల్వం త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. కొద్ది రోజుల క్రితం పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ గురైన విషయం తెలిసిందే.

Exit mobile version