తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్ తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్ వెల్లడించారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది.
ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో ఈ రోజు పర్యటించాల్సి ఉంది. స్టాలిన్ పర్యటనకు అధికారులు, డీఎంకే నేతలు భారీగా ఏర్పాట్లు చేపడుతున్న తరుణంలో ఆయన జ్వరంతో అస్వస్థత చెందారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందని, ఈ మూడుజిల్లాల్లో ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
National Herald case: ఈడీ విచారణకు రాహుల్ హాజరు.. ఢిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహం