ఎప్పటికప్పుడు మతంతో సంబంధం లేకుండా కొత్తగా తానే దైవం అంటూ.. బాబాలు, అమ్మవార్లు, అయ్యగార్లు.. ఇలా ఎంతో మంది పుట్టుకొస్తుంటారు.. ప్రజల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకుని పంబం గడిపేస్తుంటారు.. చాలా మంది జేబులకు చిల్లు పడేవరకు అసలు విషయం తెలియదు.. ఆ తర్వాత ఆయ్యో మోసపోయామే అని గొల్లు మంటారు.. ప్రభుత్వం, విజ్ఞాన వేదికలు, పలు స్వచ్ఛంద సంస్థలు.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, తమిళనాడులో మరో మహిళ కొత్త అమ్మవారి అవతారం ఎత్తారు.. తిరువ్నామలై పెన్నతూర్ గ్రామంలో అన్నపూర్ణ దేవిగా ప్రచారం చేసుకుంటుంది ఆ మహిళా అమ్మవారు.. తలపై కిరీటం, చేతిలో త్రిశూలంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు..
Read also: Mother Heroine: మహిళలకు బంపరాఫర్.. 10 మంది పిల్లలను కంటే రూ.13 లక్షలు..!
అంతేకాదండోయ్… మీకు ఏ బాధలు, సమస్యలు ఉన్నా.. పెద్ద పెద్ద రోగాలు ఉన్నా.. అమ్మవారిని దర్శిస్తే మట్టుమాయం అంటున్నారు.. నా చేయి తగిలితే చాలు… మీ బాధలు, సమస్యలు మాయం అంటూ తన భక్తుల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు ఆ మహిళా అమ్మవారు.. రోగం వస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎంత పెద్ద రోగం అయినా సరే ఆమె చేయి తగిలితే చాలు మాయం అని చెబుతున్నారు.. ఇక, ఆ మహిళ చుట్టూ చేరి.. రోజు పూజలు, హోమాలతో అనుచరులు హంగామా సృష్టిస్తున్నారు.. ఆ కొత్త అమ్మవారిలో ఉన్న మాయ ఎంత? మర్మం ఎంత? అనేది తెలియదు.. కానీ, ఇలా పుట్టుకొస్తున్న ఫేక్ బాబాలు, అమ్మవార్లు ప్రజల సమస్యలను పరిష్కరించడం కాదు.. వారిని ఆర్థికంగా.. వస్తు రూపంలో దోచేస్తూ.. కొత్త మస్యలు సృష్టిస్తున్నారని జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
