Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
- తమిళనాడు రాజకీయ అనిశ్చితికి తెర
- విజయ్‌కు వీసీకే పార్టీ మద్దతు లేఖ అందజేత
- 118కు చేరిన విజయ్ బలం
- ప్రమాణస్వీకారానికి తొలగిన అడ్డంకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్స్టాప్ పడింది. వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు తెల్పుతూ వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ లేఖ అందజేశాడు. టీవీకే నేత ఆధవ్ అర్జునకు లేఖను అందజేశారు. దీంతో విజయ్ బలం 118కు చేరింది.

Also Read
వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కు చేరడంతో మరికాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలవనున్నారు. మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయనున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు.
ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రమే గవర్నర్ అర్లేకర్ కేరళం వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణస్వీకారం ఈ రాత్రికే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు చేజారకముందే ప్రమాణస్వీకారం చేస్తే మంచిది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగింది. మొత్తానికి విజయ్‌కు మద్దతు ఇవ్వాలని వీసీకే నిర్ణయం తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Tamil Nadu | VCK extends unconditional support to TVK to form a government in the state.
With this, TVK now has the support of Congress, CPI, CPI(M) and VCK, taking its tally to 119, crossing the majority mark of 118. pic.twitter.com/iWK69ncqHq
— ANI (@ANI) May 9, 2026
#WATCH | Chennai | TVK supports cheer after VCK extends its support to TVK to form the government in Tamil Nadu. VCK President Thol Thirumavalavan has handed over the official confirmation letter to TVK leader Aadhav Arjuna. pic.twitter.com/6tcn4z00t3
— ANI (@ANI) May 9, 2026
Tamil Nadu | VCK president Thol. Thirumavalavan gives the official confirmation letter to Aadhav Arjuna – TVK General Secretary – Election Campaign Management, extending their support to TVK to form a government in the state.
(Pic: TVK) pic.twitter.com/A60i3uJ0f2
— ANI (@ANI) May 9, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్‌కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్‌కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!