Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ
- తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి
- కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్
- విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 6 రోజులు గడుస్తున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడ లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ అర్లేకర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.
సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు వీసీకే పార్టీ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో విజయ్‌కు మద్దతిచ్చేదా? లేదా? అన్నది స్పష్టం చేయనుంది. ఈ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ మద్దతిస్తే విజయ్ ప్రమాణస్వీకారానికి అడ్డంకులు తొలగిపోతాయి. లేదంటే అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే టీవీకే అధినేత విజయ్.. వీసీకే నేతలను కలిసి మద్దతు కోరారు.
అయితే వీసీకే డిప్యూటీ సీఎం పోస్ట్‌ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తిరుచ్చి ఈస్ట్ సీటు కూడా కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడే పంచాయితీ తెగడం లేదని సమాచారం. ఈ విషయంలో క్లారిటీ వస్తే మాత్రం విజయ్ ప్రమాణస్వీకారానికి అడ్డంకులు తొలగిపోయినట్లే.
తాజావార్తలు
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?