Site icon NTV Telugu

అక్క‌డి రేప‌టి నుంచే స్కూళ్లు.. సిద్ధం చేసేప‌నిలో సిబ్బంది..

క‌రోనా విజృంభ‌ణ‌తో క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప‌లు రాష్ట్రాల్లో మూత‌ప‌డిన స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.. మ‌హారాష్ట్ర‌లో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి విద్యాసంస్థ‌లు ప్రారంభం.. కాబోతున్నాయి.. 1 నుంచి 8 త‌ర‌గ‌తుల‌కు ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక‌, క‌ర్ణాట‌క‌లోనూ రాత్రి క‌ర్ఫ్యూ ఎత్తివేసిన ప్ర‌భుత్వం.. బెంగ‌ళూరు స‌హా రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి విద్యాసంస్థ‌ల‌ను రీఓపెన్ చేసేందుకు సిద్ధం అవుతోంది.. దీంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో తరగతులను శుభ్రం చేసే పనుల్లో ప‌డిపోయారు.. రేప‌టి నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను పునః ప్రారంభించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో.. దాదాపు 20 నెల‌లుగా మూతపడిన త‌ర‌గ‌తి గ‌దుల‌ను తెరచి శుభ్రం చేస్తున్నారు.

Read Also: జనసేన కార్యకర్త దారుణ హత్య

ఇక‌, కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క్లాసులు నిర్వ‌హించాల్సి ఉంది.. కార్పొరేషన్‌, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులతో క్రిమిసంహారక మందులను కూడా చల్లిస్తున్నారు. ఈసారి వంద శాతం విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది.. గతంలో తరగతులను షిఫ్ట్‌ పద్దతిలో తరగతికి ఇరవైమంది విద్యార్థులతో న‌డిపిన విష‌యం తెలిసిందే కాగా.. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి ప‌లికారు.. అదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో.. త‌ద‌నుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version