Site icon NTV Telugu

దేశంలో తగ్గుతున్న.. ఆ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుముఖం పడుతున్న వేళ తమిళనాడులో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడులో 34,285 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​కు మరో 468 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ తమిళ ప్రజలకు మరింత గుబులు పుట్టిస్తోంది. ఇక దేశంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11.53%కి తగ్గింది. రికవరీ రేటు 88.69%కి పెరిగింది.

Exit mobile version