NTV Telugu Site icon

Michoung Cyclone: తీవ్రతరమైన మిచౌంగ్ తుఫాన్.. స్తంభించిన తమిళనాడు

Untitled 4

Untitled 4

Chennai: మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వివరాలలోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజాము నుండి చెన్నైలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం లోని 14 రైల్వే సబ్‌వేల్లోకి వర్షపు నీరు చేరింది. దీనితో నీరు చేరిన 14 రైల్వే సబ్‌వేలని మూసి వేశారు. కాగా మరో 24 గంటలపాటు చుట్టుపక్కల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన చెన్నై ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే చెన్నైలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.

Read also:Revanth Reddy: ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్..! ప్రస్థానం మామూలుగా లేదుగా..

తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు ఉద్రిక్త స్థాయికి చేరడంతో బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని బ్రిడ్జ్‌ నెం:14ను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఈ నేపధ్యంలో పాఠశాలలకు, నగరం లోని కోర్టులకు సెలవులు ఇచ్చినట్లు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. కాగా వీలైనంత వరకు ప్రజలు బయటకు రాకుండా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. కాగా సోమవారం వర్షం కారణంగా చెన్నై-మైసూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ కోవై ఎక్స్‌ప్రెస్‌, కోయంబత్తూర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలను నిలిపివేశారు. అలానే సబర్బన్‌ రైళ్లను కూడా రద్దు చేశారు.