Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నాగేంద్రన్.. రేపు ప్రకటించే ఛాన్స్!

Tamilnadubjpchief

Tamilnadubjpchief

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్రన్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నైలో పర్యటిస్తున్నారు. అన్నామలై వారసుడిని అధికారికంగా శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: China-US: ట్రంప్‌కు చైనా షాక్.. అమెరికన్ వస్తువులపై 125% సుంకం!

అన్నామలై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా అన్నాడీఎంకేతో బీజేపీ సంబంధాలు దెబ్బకొట్టాయి. అయితే వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో సంబంధాలు అవసరం. దీనికి అన్నామలై అడ్డంకి మారడంతో ఇటీవల అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. తిరిగి కూటమి బలపడాలటే నాగేంద్రన్ అయితే కరెక్ట్ అని కాషాయ పార్టీ భావిస్తోంది. అతని వైపు హైకమాండ్ మొగ్గు చూపుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: వారికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం..

నాగేంద్రన్.. గతంలో అన్నాడీఎంకేలో కీ రోల్ పోషించారు. జయలలిత మరణం తర్వాత 2016లో అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. 2021లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకేతో మంచి సంబంధాలు ఉన్న కారణాన నాగేంద్రన్ అయితే.. కూటమి బలపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఈయన పేరు శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శుక్రవారం నాగేంద్రన్ అధ్యక్ష పోటీకి నామినేషన్ వేయనున్నారు. ఇక అధ్యక్ష రేసులో లేనట్లుగా అన్నామలై ఇప్పటికే ప్రకటించారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని వెల్లడించారు.

బీజేపీ చీఫ్ కావడానికి ప్రమాణాలివే..
తమిళనాడు బీజేపీ చీఫ్‌గా పోటీ చేయాలంటే బీజేపీ ప్రాథమిక సభ్యులుగా కనీసం 10 సంవత్సరాలు పని చేసి ఉండాలి. మూడు సంస్థాగత ఎన్నికల్లో పాల్గొని ఉండాలి. రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌లో ఎన్నికై 10 మంది సభ్యులచే లఖితపూర్వకంగా ఆమోదించబడి ఉండాలి. ఇక అధ్యక్ష రేసులో తమిళిసై పేరు వినిపించింది కానీ.. హైకమాండ్ మాత్రం నాగేంద్రన్ వైపే మొగ్గు చూపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Anchor Ravi: నేను క్షమాపణ చెప్పను.. టీవీ షో వివాదంపై యాంకర్ రవి! ఆడియో వైరల్

Exit mobile version