Site icon NTV Telugu

Tamilnadu: ప్రేమ పెళ్లి చేసుకున్న మంత్రి కుమార్తె.. పోలీసులను ఆశ్రయించిన దంపతులు

తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం నాడు సతీష్​అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త సతీష్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.

కొన్ని నెలల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని సతీష్ ముందుకు వచ్చాడని.. అయితే తమిళనాడు పోలీసులు సతీష్‌ను రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారని జయకళ్యాణి ఆరోపించింది. ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది. కానీ తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె ప్రాధేయపడింది. కాగా తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంత్రి శేఖర్‌బాబు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

Exit mobile version