తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 15 రోజుల నుంచి తమిళనాడులో తగ్గేదేలే అన్నట్లుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో చెన్నై సహా 23 జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నిన్న రాత్రి నుంచి చెన్నైలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read : అండమాన్‌లో అలజడి.. మరోసారి ఏపీకి భారీ వర్షసూచన..
అంతేకాకుండా మెరీనా బీచ్ లో సందర్శికులకు అనుమతి నిలిపివేశారు. తెన్ కాశీ,తిరునల్వేలి, చెంగల్ పట్టు, తూత్తుకుడి, నాగపట్జం, సేలం, కడలూరు, కృష్ణా గిరి, వేలూరు జిల్లాలకు అతి భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో తూత్తుకుడి ఎయిర్‌పోర్టులో పలు విమానాల రాకపోకలను రద్దు, మళ్లింపు చేశారు.
