Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
- డీఎంకేపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
- ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress TVK Alliance: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హీరో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న DMK – కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయ్ తన రాజకీయ ప్రయాణంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కామరాజ్ ఆశయాల నుంచి స్ఫూర్తి పొందడం విశేషమని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో రాజ్యాంగాన్ని రక్షించే లౌకిక ప్రభుత్వం ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని, బీజేపీ కనుసన్నల్లో నడిచే శక్తులు అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగా విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు పీసీసీని అధిష్టానం ఆదేశించింది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
డీఎంకేపై మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “ప్రజాతీర్పు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. ప్రస్తుత క్యాబినెట్లో సగం మంది మంత్రులు ఓడిపోయారు. డీఎంకే వైఫల్యాల వల్ల మాకు సంబంధం లేకపోయినా మేం కూడా నష్టపోయాం. ఇప్పుడు బీజేపీ కన్ను తమిళనాడుపై పడింది. ప్రజలు తిరస్కరించిన వారి పక్షాన ఉండాలా? లేక బీజేపీని అడ్డుకునే శక్తితో చేతులు కలపాలా? అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది” అని రాసుకొచ్చారు.
ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ క్లారిటీ
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ అంశంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పందిస్తూ.. టీవీకే నుంచి తమకు లేఖ అందిందని ధృవీకరించారు. తమకు మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరినట్లు గవర్నర్ తెలిపారు. ఈ సాయంత్రం విజయ్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ అయిన టీవీకే అనూహ్య రీతిలో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పార్టీలు సాధించిన స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.. TVK (విజయ్)108, DMK 59, ADMK 47, కాంగ్రెస్ 05, ఇతరులు 08. మొత్తానికి డీఎంకే అధికారాన్ని విజయ్ నేతృత్వంలోని టీవీకే కూల్చివేసి, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
The President of Tamizhaga Vettri Kazhagam (TVK), Thiru C Vijay, has formally requested the Indian National Congress (INC) to extend its support for forming a government in Tamil Nadu. The people of Tamil Nadu, especially the youth, have delivered a very clear, strong and… pic.twitter.com/Aig79MoRoE
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) May 6, 2026
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!