Site icon NTV Telugu

Tamilnadu: తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం.. జయలలిత మృతిపై మరికొందరిని విచారించేందుకు ఛాన్స్..

Tamilnadu Cabinet

Tamilnadu Cabinet

Tamilnadu: తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్ జడ్జి జస్టిస్ ఆరుముగసామి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్.. జయలలిత నెచ్చెలి సహా మరికొందరిని విచారించేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయించింది. శశికళ, శివకుమార్‌లతో పాటు నాటి ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావుపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలనే సిఫారసులపై న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది తమిళనాడు మంత్రివర్గం.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి, తూత్తుకుడి హింస, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ తదితర అంశాలకు సంబంధించిన దర్యాప్తు నివేదికపై చర్చించడం ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చకు వచ్చింది. జయలలిత మృతిపై విచారణ జరిపిన రిటైర్డ్ జడ్జి ఆరుముగసామి ఆగస్టు 27న తన నివేదికను సమర్పించగా.. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీషన్ 2018లో స్టెరిలైట్ వ్యతిరేక నిరసన సందర్భంగా జరిగిన తూత్తుకుడి కాల్పులపై నివేదికను సమర్పించారు. కలెక్టర్‌తో సహా 17 మంది పోలీసు సిబ్బంది, నలుగురు జిల్లా అధికారులపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన అరుణ జగదీశన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం అంగీకరించింది.

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో శశిథరూర్!

కాగా, జయలలిత మృతిపై విచారణ చేపట్టిన ఆరుముగసామి.. వీకే శశికళ, శివకుమార్‌, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్‌మోహన్‌రావులపై ప్రభుత్వ విచారణకు సిఫారసు చేసినట్లు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. న్యాయసలహా పొంది చర్యలు తీసుకోవాలని, నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆరుముగసామి కమిషన్ నవంబర్ 2017లో ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. మరో ముఖ్యమైన సమస్య ఆన్‌లైన్ జూదం, ఆన్‌లైన్ జూదానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

Exit mobile version