తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తల్లిదండ్రుల కోసం స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించే బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో పేరెంట్స్‌కు భారీ ఊరట లభించింది.
బిల్లు ఆమోదం పొందడంతో ఇకపై ఏకపక్షంగా ఫీజులు పెంచేందుకు పాఠశాలలకు ఎలాంటి అవకాశం ఉండదు. త్వరలోనే అమలు తేదీపై నోటిఫికేషన్ రానుంది. ఇక చట్ట ప్రకారం ఫీజుల నియంత్రణ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఫీజులు నిర్ణయించిన తర్వాత మూడు సంవత్సరాలు పాటు చెల్లుబాటు అవుతాయి. అన్ని ప్రైవేటు పాఠశాలలకు ఈ సూత్రం వర్తించనుంది.
ఈ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సంఘం నుంచి తల్లిదండ్రుల ప్రతినిధి, పాఠశాల విద్య డైరెక్టర్, ప్రైవేట్ పాఠశాలలు, ప్రాథమిక విద్య ప్రతినిధులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జాయింట్ చీఫ్ ఇంజనీర్, పాఠశాల విద్యాశాఖ అధికారి ఉంటారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఈ కమిటీ ఫీజులను నియంత్రిస్తుంది. మొత్తానికి ఎన్నికల వేళ తల్లిదండ్రులకు ఇది భారీ ఊరట గానే చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం
