Site icon NTV Telugu

తాలిబ‌న్ల ప్ర‌భావం: ఇండియాలో వీటి ధరలు పెరుగుతాయా…!!

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకోవ‌డంతో తిరిగి ఆ దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటాయో అని ప్ర‌పంచం మొత్తం అందోళ‌న చెందుతున్న‌ది.  ఆఫ్ఘ‌నిస్తాన్ చిన్న‌దేశ‌మే అయిన‌ప్ప‌టికి భార‌త్‌కు మిత్ర‌దేశం.  ఆ దేశంలో భార‌త్ కోట్లాది రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్టి జాతీయ ప్రాజెక్టులు, ర‌హ‌దారులు నిర్మించింది.  ఇప్పుడు తాలిబ‌న్ల చేతిలోకి ఆఫ్ఘన్ పాల‌న వెళ్ల‌డంతో దాని ప్ర‌భావం అనేక వ‌స్తువుల‌పై ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. ఇండియా నుంచి అనేక వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకునే ఆఫ్ఘ‌నిస్తాన్, ఇక‌పై ఇండియా నుంచి ఆ వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి.  అదే విధంగా కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఇండియా ఆ దేశం నుంచి దిగుమ‌తి చేసుకుంటుంది.  తాలిబ‌న్ల సంబంధాల‌ను బ‌ట్టి వ‌స్తువుల ధ‌ర‌లు ఆధాప‌డి ఉండే అవ‌కాశం ఉన్న‌ది.  ఆఫ్ఘ‌న్ నుంచి ఇండియా ఎండు ద్రాక్ష‌, ఇంగువ‌, జీల‌క‌ర్ర‌, ఔష‌దాల్లో వినియోగించే కొన్ని ర‌కాల తొక్క‌లు, చ‌ర్మాలు, మూలిక‌ల మొక్క‌లు, నూనే గింజ‌లు వంటివి దిగుమ‌తి చేసుకుంటుంది.  

Read: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల కీలక సమావేశం

వీటి ధ‌ర‌ల‌పై భారీ ప్ర‌భావం క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  వీటితో పాటుగా చ‌మురు ధ‌ర‌ల‌పై కూడా ప్ర‌భావం క‌నిపించే అవ‌కాశం ఉన్న‌ది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఛాబ్‌హార్ పోర్ట్‌ను ఇండియా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ పోర్ట్ నుంచి యూర‌ప్‌కు భార‌త్ వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్న‌ది.  ఈ పోర్ట్ నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ది.  ఇప్ప‌టికే ఛాబ్‌హార్ పోర్టు నుంచి వ్యాపార‌లావాదేశీలు సాగుతున్నాయి.  తాలిబ‌న్లు ఈ పోర్టు నిర్మాణాన్ని నిలిపివేస్తే దాని వ‌ల‌న భార‌త్‌కు భారీ న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.  యూర‌ప్‌కు వాణిజ్యం నిర్వ‌హించాలంటే పాత రోజుల మాదిరిగా ఆఫ్రికా నుంచి ప్ర‌యాణాలు సాగించాల్సి వ‌స్తుంది.  ఇది ఖ‌ర్చుతో కూడిన వ్య‌వ‌హారం. అయితే, ఇండియా నిర్మించిన వాటికి ఎలాంటి న‌ష్టం క‌లిగించ‌బోమ‌ని తాలిబ‌న్లు చెబుతున్నా అది ఎంత వ‌ర‌కు సాధ్యం అవుతుంది అన్న‌ది వేచి చూడాలి.  

Exit mobile version