Site icon NTV Telugu

EY Employee Death: అన్నా సెబాస్టియన్ మరణంపై నివేదిక కోరిన హ్యుమన్ రైట్స్ సంస్థ..

Ey Employee Death

Ey Employee Death

EY Employee Death: ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడి ఎలా ఉంటుందనే విషయాలను ఆమె మరణం వెలుగులోకి తెచ్చింది. తన కూతురు ‘‘పని ఒత్తిడి’’తో మరణించిందని అన్నా తల్లి ఆరోపించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు గురైన అన్నా, చికిత్స పొందుతూ మరణించింది. తన కూతురు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా పని చేసేదని, తినడానికి, నిద్ర పోవడానికి కూడా సమయం దొరికేది కాదని ఆమె తండ్రి సిబి జోసెఫ్ కన్నీటి పర్యంతమయ్యాడు.

Read Also: IND vs BAN: అశ్విన్‌ గురించి ఏం చెప్పాలి.. ప్రతిసారీ అతడివైపే చూస్తాం: రోహిత్

తాజాగా ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నివేదిక కోరింది. అన్నా సెబాస్టియన్ మరణానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలను కోరింది. “ప్రతి యజమాని తన ఉద్యోగులకు సురక్షితమైన, సురక్షితమైన మరియు సానుకూల వాతావరణాన్ని అందించడానికి ప్రధాన విధిని కలిగి ఉంటాడు. వ్యాపారాలు మానవ హక్కుల పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబించేలా వారి ఉపాధి విధానాలను క్రమం తప్పకుండా నవీకరించడం మరియు సవరించడం చాలా ముఖ్యమైనది” హ్యూమర్ రైట్స్ కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణించడం దేశవ్యాప్తంగా కార్పొరేట్ కల్చర్‌పై ఆందోళన రేకెత్తించాయి. ఆమె మరణం తర్వాత చాలా మంది ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా హైలెట్ చేశారు. ఒకరు కార్పొరేట్ ఉద్యోగం కష్టమని చెబితే, మరొకరు తన సీనియర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పారు. పెరాయిల్ గుండెపోటుతో మరనించినట్లు నివేదించబడిన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version