NTV Telugu Site icon

Swiggy: ఆ సేవలకు స్వస్తి పలకనున్న స్విగ్గీ… 5 నగరాల్లో నిలిపివేత

Swiggy

Swiggy

‘స్విగ్గీ’ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఫుడ్ డెలవరీలతో చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం మెట్రోసిటీల్లో బిజీ లైఫ్ కారణంగా హోటళ్లు వెళ్లి తినే అలవాటును తగ్గించుకుంటున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫారాలను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఆర్డర్లు చేసిన తక్కువ సమయంలో నేరుగా ఫుడ్ ను ఇళ్లు తీసుకువస్తున్నారు. దీంతో స్విగ్గీ సంస్థకు ఆదాయం బాగానే వస్తోంది.

ఇదిలా ఉంటే స్విగ్గీ ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న ‘సూపర్ డైలీ’ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. వినియోగదారులకు గ్రాసరీస్, పాలు, కిరాణా సామాగ్రి ఇతరత్రా నిత్యావసరాలను వినియోగదారులకు అందించేందుకు స్విగ్గీ సూపర్ డైలీని తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలోని 5 మహానగరాల్లో ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణే, చెన్నై నగరాలు ఉన్నాయి.

అయితే బెంగళూర్ లో మాత్రం తమ సేవలను రెట్టింపు చేస్తామని స్విగ్గీ సహవ్యవస్థాపకుడు, స్విగ్గీ సూపర్ డైలీ సీఈఓ ఫణి కిషన్ అద్దెపల్లి తెలిపారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మే 12, 2022 నుంచి ఈ ఐదు నగరాల్లో స్విగ్గి సూపర్ డైలీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం స్విగ్గీ తన పిక్ ఆప్ డ్రాప్ సేవలైన స్విగ్గీ జినీని కూడా చాలా నగరాల్లో తగ్గించుకుంది. దేశవ్యాప్తంగా ఫుడ్ డెలవరీ ఆర్డర్లకు వస్తున్న డిమాండ్ తో…డెలవరీ పార్ట్ నర్ల కొరత కారణంగా స్విగ్గీ తన అనుబంధసేవలను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.