Site icon NTV Telugu

Swara Bhasker Marriage: స్వరా భాస్కర్ పెళ్లి లీగల్ కానీ ఇస్లామిక్ కాదు.. అల్లా దీన్ని అంగీకరించరు….

Swara Bhaskar

Swara Bhaskar

Swara Bhasker Marriage: ప్రముఖ బాలీవుడ్ నటి స్వరాభాస్కర్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహాద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెళ్లిపై పలు విమర్శలు వస్తున్నాయి. భయ్యా అని పిలిచే వ్యక్తి పెళ్లి చేసుకున్నావని కొంతమంది నెటిజెన్లు స్వరా భాస్కర్ ను విమర్శిస్తుంటే.. తాజాగా ఓ ఇస్లామిక్ స్కాలర్ చేసిన ట్వీట్ మరో వివాదానికి కారణం అయింది. చికాగోకు చెందిన ఇస్లామిక్ స్కాలర్ యాసిర్ నదీమ్ అల్ వాజిది చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. స్వరా భాస్కర్ ముస్లిం కాకపోతే, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ముస్లిం అయితే ఈ వివాహం ఇస్లామిక్ ప్రకారం చెల్లదు అని.. బహుదేవతారాధన చేసే స్త్రీలను నమ్మే వరకు వివాహం చేసుకోవద్దని అల్లా చెబుతున్నారని.. ఆమె వివాహం కోసం ఇస్లాంను అంగీకరించినట్లయితే, దాన్ని అల్లా అంగీకరించడని డాక్టర్ యాసిర్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ పై ప్రముఖ ఆర్జే సయేమా స్పందించారు. ఆమె స్వరాభాస్కర్-ఫహాద్ పెళ్లిని సమర్థించారు. మీరు ఖురాన్ ను ఉదహరించడం ఖచ్చితమైనదే అయితే స్వరా లేదా ఫహాద్ మిమ్మల్ని సలహా అడిగారా..? వారిని అలా ఉండనివ్వండి, అల్లా మిమ్మల్ని ఏం అడగడు, నీయత్ అనేది ఇస్లాం యొక్క మూలస్తంభం, మీ ప్రవర్తన సందేహాస్పదంగా ఉంది, ఇది ఇస్లాంకు అపచారం, మీరు దానిని గ్రహించారని ఆశిస్తున్నానంటూ ఆర్జే సయేమా ట్వీట్ చేశారు.

Read Also: Tarakaratna: బిగ్ బ్రేకింగ్.. చికిత్స పొందుతూ తారకరత్న మృతి

సయేమా ట్వీట్ కు ప్రతిగా యాసిర్ మరో ట్వీట్ చేశారు. నా ట్వీట్ వ్యక్తిగత ఎంపిక గురించి కాదని.. పాపాలను సాధారణీకరించడం గురించి అని, నేను ఖురాన్ ను ఉదహరించడం సరైనదని మీరు అంటున్నారు కాబట్టి ఈ వివాహం బహిరంగంగా చేసిన పాపం అని యాసిర్ అన్నారు. కాగా దీనికి సయేమా.. దీనికి మీరు ఎవరు.. అల్లా నియమించిన వ్యక్తా..? అని ప్రశ్నించారు. మనం అల్లాకు మాత్రమే జవాబుదారీగా ఉంటాము, మంచి ముస్లింగా ఉండండి అంటూ యాసిర్ కు సలహా ఇస్తూ ట్వీట్ చేసింది.

నేను మీలాంటి ఉదారవాదులను ఎక్కువగా ద్వేషించే వ్యక్తినని సయేమాను గురించి యాసిర్ మరో ట్వీట్ చేశారు. ఆర్జేలు ఇస్లాంను అర్థం చేసుకోవడానికి ముందే నేను మాట్లాడుతున్నానని.. మీరు వినోదాన్ని కొనసాగించండి, ఇస్లాం వదిలేయండి అంటూ మరో ట్వీట్ చేశారు డాక్టర్ యాసిర్.

Exit mobile version