Site icon NTV Telugu

Swara Bhasker: “బాలిక విద్యను వద్దన్న మౌలానాతో స్వరా భాస్కర్”.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

Swara Bhaskar

Swara Bhaskar

Swara Bhasker: బాలీవుడ్ వివాదస్పద నటి స్వరా భాస్కర్ తన భర్త ఫహద్ అహ్మద్‌తో శనివారం వివాదాస్పద ఇస్లామిక్ వ్యక్తి మౌలానా సజ్జాద్ నోమానిని కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలు సందర్భాల్లో హిందూమతానికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వార్తల్లో నిలిచిన స్వరాభాస్కర్‌ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘‘తల్లిదండ్రులు తమ కుమార్తెలను పాఠశాలకు , కళాశాలకు పంపడం ‘హరామ్’గా పేర్కన్న మౌలానాని కలిసినందుకు స్వరాభాస్కర్’’ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు ఆమె డ్రెస్సింగ్‌ని తిట్టిపోస్తున్నారు.

Read Also: CM Revanth Reddy: వీరుల గ‌డ్డలో విద్రోహులు షిండే, అజిత్ ప‌వార్‌, అశోక్ చ‌వాన్‌..

స్వరా భాస్కర్ భర్త ఫహద్ ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ‘‘ మౌలానా సజ్జాద్ నోమాని సేవలో,అతను మాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు’’ అని ఫహాద్ మౌలానా ఫోటోలను పోస్ట్ చేశారు. అయితే, మహిళల హక్కులపై తెగ మాట్లాడే స్వరా ఇప్పుడు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కలవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Exit mobile version