Swami Vivekananda Statue Unveiled In Mexico: లాటిన్ అమెరికా దేశాల్లోనే తొలిసారిగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెక్సికో దేశంలోని ఓ యూనివర్సిటీలో స్వామి వివేకానంద విగ్రహాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆవిష్కరించారు. మెక్సికోలోని భారత పార్లమెంటరీ బృందానికి ఓం బిర్లా నాయకత్వం వహించారు. మెక్సికోలోని మిడాల్గోలోని అలానమస్ యూనివర్సిటీ ఆఫ్ స్టేట్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వివేకానందుడి బోధనలు, వ్యక్తిత్వం భారతదేశంలోనే కాకుండా ప్రపంచదేశాల ప్రజలకు కూడా ప్రేరణ ఇవ్వానలి లోక్ సభ సెక్రరేటియట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Also: CM Nitish Kumar: వచ్చే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుంది.
1893 చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ లో వివేకానందుడు చేసిన ప్రసంగాన్ని ఓంబిర్లా ప్రస్తావించారు. తన ప్రసంగం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారని.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశారని ఆయన అన్నారు. స్వామీజీ సందేశం మానవాళికి ఉపయోగం అని.. మెక్సికోలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా ట్వీట్ చేశారు.
మెక్సికలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం గౌరవంగా ఉందని.. లాటిన్ అమెరికా దేశాల్లో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే తొలిసారని.. ఈ విగ్రహం ప్రజలకు, ముఖ్యంగా ఈ ప్రాంత యువతలో స్పూర్తినిస్తుందని.. ఇది వారి దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుందని ఓం బిర్లా అన్నారు.