NTV Telugu Site icon

BJP Suspend Two leaders: ఇద్దరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. వారిద్దరు ఏం చేశారంటే..

Bjp Leders Suspended

Bjp Leders Suspended

Suspended BJP leader Seema Patra arrested: అక్రమాలకు, హింసకు పాల్పడిన ఇద్దరు బీజేపీ నాయకులను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. చైల్డ్ ట్రాఫికర్స్ నుంచి ఏడు నెలల బాలుడిని కొనుగోలు చేసిన ఆరోపణలపై ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్ ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. వినీతా అగర్వాల్, ఆమె భర్త కృష్ణ మురారి అగర్వాల్ లకు కుమార్తె ఉంది. అయితే తమకు మగ బిడ్డ ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ ఏడు నెలల శిశువును రూ.1.80 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ చర్యకు పాల్పడినందుకు పార్టీ వినీతా అగర్వాల్ ను సస్పెండ్ చేసింది.

ఫిరోజాబాద్ వార్డ్ 51కి చెందిన కార్పొరేటర్ వినీతా అగర్వాల్ ను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ఫిరోజాబాద్ చీఫ్ రాకేష్ శంఖ్వార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 24న మథుర జంక్షన్ ప్లాట్‌ఫారమ్ నుండి చిన్నారిని దొంగిలించగా.. రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వినీతా అగర్వాల్ ఆమె భర్తతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

Read Also: Current Shock to Mother and Daughter: పండగపూట విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి

మరో కేసులో మరో మహిళా నాయకురాలిని బీజేపీ సస్పెండ్ చేసింది. జార్ఖండ్ కు చెందిన సీమా పాత్ర తన ఇంట్లో పనిచేసే సునీతను చిత్రహింసలు పెట్టి, తరుచూ కొడుతూ ఉండేది. ఓ గిరిజన మహిళను నిర్భంధించి వేధించిన కేసు సీమా పాత్రపై నమోదు అయింది. సీమాా పాత్ర మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర భార్య. తనను బందీ చేసి దారుణంగా హింసించేదని బాధితురాలు సునీత వెల్లడించారు. రోజులు తరబడి ఆహారం ఇవ్వకుండా.. విపరీతం కొట్టేవారని తెలుస్తోంది. పక్కా సమాచారంతో రాంచీ పోలీసులు సునీతను రక్షించి రిమ్స్ కు తరలించారు. ఈ వ్యవహారం జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దాకా వెళ్లింది. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. సీమా పాత్రపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. బీజేపీ పార్టీ సీమా పాత్రను పార్టీ నుంచి బహిష్కరించింది.