Spy Pigeon: ఒడిశాలోని పారాదీప్ తీరంలో ఓ అనుమానిత గూఢచార పావురం కలకలం సృష్టిస్తోంది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఓ పావురానికి కెమెరా, మైక్రోచిప్ అమర్చి ఉండటాన్ని అక్కడి స్థానికులు గమనించారు. దీన్ని ఓ చేపలు పట్టే పడవలో పట్టుబడింది. ఈ పావురాన్ని గూఢచర్యానికి ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం కొందరు మత్స్యకారులు తమ పడవపై పావురం ఉన్నట్లు గుర్తించారు. బుధవారం పారాదీప్‌లో పక్షిని పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు హోండా గుడ్ బై.. కుదేలైన పాక్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ
అక్కడి అధికారులు పావురం కాలుకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు ఒడిశా రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపారు. పావురం కెమెరా, మైక్రోచిప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోందని జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్ పీఆర్ తెలిపారు. తెలియన భాషలో పావురం రెక్కలపై ఏదో భాషలో అక్షరాలు ఉన్నాయని, ఏం రాశారో తెలుసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ముందుగా ఈ పావురాన్ని చేపల పడవ సిబ్బంది పీతాంబర్ బెహెరా గుర్తించారు. పడవపై పావురాన్ని చూశానని, దాని కాళ్లు ఏవో పరికరాలు ఉన్నట్లు గుర్తించానని, దాని రెక్కలపై కూడా ఏదో రాసి ఉందని, అయితే అది ఒడియా కాకపోవడంతో తనకు అర్థం కాలేదని తెలిపారు. పావురం దగ్గరకు రాగానే పట్టుకున్నానని, 10 రోజుల క్రితం కోణార్క్ తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో లంగర్ వేయగా, పడవపై పావురం కనిపించినట్లు అతడు వెల్లడించారు.