Site icon NTV Telugu

IKEA: మొదటి మహిళా సీఈవోగా సుసానే పుల్వెరర్‌

ఐక్కా(IKEA) స్వీడిష్ గృహోపకరణాల రిటైలర్, సుసానే పుల్వెరర్‌ను తన భారతదేశ వ్యాపారం కోసం దాని కొత్త మరియు మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ (CSO)గా నియమించింది. సుసానే అవుట్‌గోయింగ్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఐక్కా ఇండియాలోని సుసానే పుల్వెరర్ ఇంగ్కా గ్రూప్‌లో ఇంతకుముందు గ్రూప్ బిజినెస్ రిస్క్ మరియు కంప్లయన్స్ మేనేజర్‌గా పనిచేశారు. సుసానే 1997లో ఐక్కాలో చేరారు. ఐక్కాలో సుసానే విభిన్న పాత్రల్లో పనిచేశారు.

ఆమె ఐక్కా గ్రూప్‌కి ఎన్విరాన్‌మెంట్‌ మేనేజర్‌గా తన ఐక్కా ప్రయాణాన్ని ప్రారంభించింది. అంతేకాకుండా ఆమె ఐక్కా ఆఫ్ స్వీడన్‌కు వెళ్లారు. ఐక్కా అభివృద్ధికి ఆమె వివిధ వ్యాపార వర్గాల్లో కీలక పాత్రలను పోషించారు. 2017లో మరోసారి ఐక్కా ఇండియాలో చేరడానికి ముందు, సుసానే ఐక్కా అంతర్గత ఏజెన్సీ అయిన ఐక్కా కమ్యూనికేషన్స్‌లో ఎండీగా పనిచేసింది. ఈ సమయంలో ఆమె మెరుగైన వ్యాపారాన్ని మరియు వ్యక్తుల ఫలితాలను అందించడానికి క్రీయాశీలక నిర్ణయాలు ద్వారా సంస్థను ముందుకు నడిపించింది.

Exit mobile version