Suryanagari Express derails in Rajasthan: ముంబై-జోధ్‌పూర్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని పాలి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై బాంద్రా టెర్మినల్ నుంచి బయలుదేరిని సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ జోధ్ పూర్ డివిజన్ లోని రాజ్ కియావాస్ -బోమద్ర సెక్షన్ మద్య తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి.
నార్త్ వెస్ట్రన్ రైల్వే ప్రకారం ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని తెలిపింది. రైల్వే శాఖ జోధ్‌పూర్ నుంచి సహాయక రైలును పంపింది. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. నార్త్ వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు జైపూర్ లోని ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వెల్లడించారు.
Read Also: Delhi: తీవ్ర విషాదం.. మహిళను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కార్..
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే రైలులో భారీ శబ్ధం వినిపించిందని ప్రయాణికులు వెల్లడించారు. భారీ శబ్ధం తరువాత రైలు ఆగిపోయింది. 8 స్లీపర్ కోచ్ లు ట్రాక్ నుంచి బయటకు వచ్చాయి. ఘటన జరిగిన 15-20 నిమిషాల్లో అంబులెన్సులు ప్రమాదస్థలికి చేరుకున్నాయని ప్రయాణికలు వెల్లడించారు.