Surat Fire Accident: గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న అనుమప్ రసయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే కంటైనర్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒక కార్మికుడు సజీవ దహనం అయ్యారు. 20 మంది కార్మికులు గాయపడగా.. మరో ముగ్గురు కనిపించడం లేదు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిని 20 మందిని సూరత్ లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీస్ అధికారి డీవి బల్దానియా తెలిపారు.
తప్పిపోయిన ముగ్గురు కార్మికుల కోసం ఫ్యాక్టరీలో వెలుతున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన వెంటనే ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించడంతో పెద్ద ప్రమాదం జరిగింది. పదిహేను ఫైరింజన్ల సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు రెండు గంటలు పట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారి బసంత్ పరీక్ తెలిపారు.