NTV Telugu Site icon

Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..

Godhra Train Burning Case

Godhra Train Burning Case

Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ ప్రభుత్వంతో పాటు పలువురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వాయిదాలు వేయబోమని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, రాజేష్ జిందాల్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 27, 2002న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని S-6 కోచ్‌ని కాల్చివేయడంతో 59 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలో మత కలహాలకు కారణమైంది. ఇరు వర్గాలకు చెందినవారు మరణించారు. అనేక మంది దోషుల శిక్షను సమర్థిస్తూ, 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ గుజరాత్ హైకోర్టు అక్టోబర్ 2017లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ కేసులో హైకోర్టు జీవిత ఖైదు విధించబడిన 11 మంది దోషులకు మరణశిక్ష విధించాలని కోతురూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది.

Read Also: Flipkart and Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు..

అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను గురువారం విచారణకు తీసుకుంది. మరణశిక్షకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ముందు వాదించాల్సి ఉన్నందున ఈ విషయాన్ని మరో రోజు విచారణకు వాయిదా వేయాలని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది స్వాతి గిల్దియాన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్వాతి గిల్డియాల్ అభ్యర్థన మేరకు జనవరి 15, 2025న ఈ కేసుని జాబితా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో 11 మంది దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. మరో 20 మందికి జీవతఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం 31 మంది దోషుల శిక్షల్ని హైకోర్టు సమర్థించింది. మరణశిక్ష పడిన దోషుల శిక్షను జీవితఖైదుగా మార్చింది.