Sri Krishna Janmabhoomi: ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఈరోజు (జనవరి 15న) విచారణ జరగనుంది. ఈ వివాదంపై దాఖలైన 15 కేసులను విచారణకు తీసుకో వద్దని మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు ఏక సభ్య న్యాయస్థానం గత ఆగస్టు 1వ తేదీన తిరస్కరించడంతో కమిటీ అత్యున్నత న్యాయస్థానాకి వెళ్లింది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్ హయాంలో కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు గొడవ చెలరేగడంతో 1991లో పార్లమెంట్ ప్రార్థన స్థలాల చట్టం తీసుకొచ్చింది. మన స్వాతంత్య్ర దినమైన 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ప్రార్థన స్థలాలకున్న మత స్వభావాన్ని మార్చొద్దని ఆ చట్టంలో వెల్లడించింది.
Read Also: PM Modi: నేడు నేవీలోకి మరో మూడు యుద్ధనౌకలు.. జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని మోడీ
ఇక, అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి ప్రత్యేక ప్రార్థన స్థలాల చట్టం నుంచి 1991లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. శ్రీ కృష్ణ జన్మభూమి సమీపంలోని మసీదుపై హిందూ సంస్థలు వేసిన పిటిసన్ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మసీదు కమిటీ హైకోర్టులో వేసిన పిటిషన్ లో తెలిపింది. దానికి ఆలహాబాద్ ఉన్నత న్యాయస్థానం సింగిల్ బెంచ్ న్యాయమూర్తి 1991నాటి చట్టం మత స్వభావమంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదని, వివాదాస్పద స్థలంలో మసీదు, ఆలయం పక్కపక్కనే ఉండటం వల్ల ఆ స్థలం మత స్వభావాన్ని నిర్దారించలేమని తీర్మానించారు. అక్కడి కట్టడం మసీదు లేదా ఆలయం అయి ఉండాలి.. కానీ, ఏకకాలంలో రెండూ కాలేదన్నారు.