NTV Telugu Site icon

Supreme Court: కేంద్రానికి సుప్రీంలో ఊరట.. ఈడీ డైరక్టర్‌ పదవీకాలం పొడిగింపుకు అనుమతి

Supreme Court

Supreme Court

Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గొప్ప ఊరట లభించింది. ఈడీ డైరక్టర్‌ పదవీకాలం పొడిగింపుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈడీ చీఫ్‌ను సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగించడానికి సుప్రీం కేంద్రానికి అనుమతించింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని పొడగించాలని కేంద్రం చేసిన అభ్యర్థణపై సుప్రీం ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈడీ డైరక్టర్‌గా ఉన్న ఎస్‌కే మిశ్రాను సెప్టెంబర్ 15 వరకు ఈడీ చీఫ్‌ బాధ్యతల్లో కొనసాగేందుకు అనుమతినిచ్చింది.

Read also: Warangal Floods: వరంగల్‌లో నీట మునిగిన లేడీస్‌ హాస్టల్.. సాయం కోసం బిల్డింగ్ ఎక్కిన స్టూడెంట్స్..

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ మిశ్రా(63) పదవీ కాలాన్ని అక్టోబర్ 15 వరకు పెంచమని కోరుతూ బుధవారం కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలసిందే. ఈడీ డైరక్టర్‌ పదవీ కాలం పొడిగింపుపై సుప్రీంకోరు్టలో రెండో రోజు వాదనలు కొనసాగాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టును కేంద్రం గడువు కోరింది. వాదనల సందర్భంగా ప్రస్తుత చీఫ్‌ మినహా మిగతా మొత్తం విభాగం అసమర్థులతో నిండి ఉందా? అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఎస్‌కే మిశ్రా అనివార్యమైన వ్యక్తి కాదని.. కానీ ఎఫ్‌ఏటీఎఫ్‌ సమీక్షకు ఆయన ఉండటం అవసరమని కేంద్రం పేర్కొంది. ఆయన్ను మరికొంత కాలం కొసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం ధర్మాసనాన్ని కోరింది. దీంతో సెప్టెంబర్ 15 వరకు ఎస్.కె. మిశ్రా ఆ పదవిలో కొనసాగవచ్చంటూ ధర్మాసనం తెలిపింది. సెప్టెంబర్ 15 అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ఎట్టిపరిస్థితుల్లో తప్పుకోవాల్సిందేనంటూ జస్టిస్ బిఆర్ గవై, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ఆదేశించింది. ఈడీ చీఫ్ పదవీ కాలాన్ని మూడు సార్లు కంటే ఎక్కువసార్లు పొడిగించడం చట్ట వ్యతిరేకమని చెబుతూ గతంలో జులై 31 వరకు ఎస్.కె.మిశ్రా పదవిని పొడిగించింది సుప్రీం కోర్టు. అంతకు ముందు ఏడాది నవంబరులో, మిశ్రా రిటైర్మెంటుకు ఒక్కరోజు ముందు ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించిన సుప్రీం కోర్టు ఇప్పుడు మూడోసారి కూడా పదవీ కాలాన్ని పొడిగించింది.