Madrassas: గుర్తింపు లేని మదర్సాల విద్యార్థులను ప్రభుత్వ స్కూల్స్ కు తరలించాలని, మదర్సా బోర్డులకు రాష్ట్రాలు నిధులు ఇవ్వొద్దని రాష్ట్రాలను కోరుతూ బాలల హక్కుల సంఘం చేసిన సిఫార్సులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. మదార్సాల్లో విద్యా హక్కు చట్టాన్ని పాటించట్లేదని.. అక్కడ బోధించే విద్య.. స్టూడెంట్స్ కు ఎందుకూ పని కిరాదని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( ఎన్సీపీసీఆర్) ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానికి వెల్లడించింది.
Read Also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్ స్టెప్పులు..
ఇక, ఈ ఏడాది జూన్ 7, జూన్ 25వ తేదీల్లో గుర్తింపు లేని మదర్సాల స్టూడెంట్స్ ను ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచనలు చేయడంతో ఉత్తర ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిని అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ ప్రభుత్వాల చర్యలను వ్యతిరేకిస్తూ ముస్లిం సంస్థ జమియాత్ ఉలేమా-ఇ-హింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఇరు పక్షాల తరఫు సీనియర్ న్యాయవాదులు చేసిన సమర్పణలను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రాష్ట్రాలకు ఇచ్చిన ఉత్తర్వులపై కూడా స్టే విధించింది.