Site icon NTV Telugu

Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్రానికి.. రాష్ట్రాలకు నోటీసులు

Supreme Court

Supreme Court

ఆరావళి పర్వత శ్రేణులపై గతంలో ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సవరించింది. మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించకూడదని గతంలో ఇచ్చిన తీర్పుపై తాజాగా న్యాయస్థానం స్టే విధించింది. నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా నిలిపివేసింది. మునుపటి కమిటీలో నిపుణుల కాకుండా.. అధికారులే ఎక్కువగా ఉన్నారని అభిప్రాయపడింది. తదుపరి విచారణ జనవరి 21కు వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: 2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!

ఆరావళి పర్వత శ్రేణుల విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఆరావళి పర్వతాలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మునుపటి నివేదికను పునఃపరిశీలించడానికి సంబంధిత రంగంలో నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కమిటీ ఏర్పాటుకు ముందు కమిటీ దర్యాప్తు చేసే ప్రాంతాలను నిర్ణయించాలని సొలిసిటరీ జనరల్ కోరారు. నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో అమికస్ క్యూరీ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సహాయం చేయనున్నారు. ఇకపై మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దని రాష్ట్రాలకు ఇప్పటికే నోటీసు జారీ చేసినట్లు సొలిసిటరీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఇది కూడా చదవండి: Maharashtra: స్థానిక ఎన్నికల కోసం ఒక్కటైన పవార్ కుటుంబం.. చేతులు కలిపిన శరద్ పవార్-అజిత్ పవార్‌

Exit mobile version