Site icon NTV Telugu

ఉత్తరప్రదేశ్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు…

Supreme Court

Supreme Court

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస దురదృష్టకరమని సోమవారం విచారం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని విచారం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన (సత్యాగ్రహం ) నిర్వహించడానికి అనుమతి కోరుతూ “కిసాన్ మహాపంచాయత్” దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. అయితే లఖింపూర్ ఖేరి లాంటి సంఘటనలు నిరోధించేందుకు, ఏలాంటి నిరసన ప్రదర్శనలకు అనుమతించరాదని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అన్నారు. అయితే ఆదివారం జరిగిన హింసపై కెకె వేణుగోపాల్ కూడా విచారం వ్యక్తం చేసారు. ఇక ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 21 కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Exit mobile version